Wednesday, 5 October 2016

ఫేస్‌బుక్ నుంచే ఇక‌ ఆన్‌లైన్ షాపింగ్


Facebook soon to introduce shop feature in it's app



















ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ త‌న యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో ఓ కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యాప్‌ల నుంచే ఇక‌పై యూజ‌ర్లు నేరుగా షాపింగ్ చేయ‌వ‌చ్చు. అందుకోసం ఓ ప్ర‌త్యేక‌మైన ఆప్ష‌న్‌ను త‌న యాప్‌లో ఫేస్‌బుక్ ఏర్పాటు చేయ‌నుంది. 

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ఫేస్‌బుక్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్లు ఆ యాప్‌లోనే ఏర్పాటు చేయ‌నున్న 'SHOP' అని పిల‌వ‌బ‌డే సెక్ష‌న్‌ను ఓపెన్ చేస్తే అందులో వారు త‌మ‌కు కావ‌ల్సిన వ‌స్తువును ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు. గృహావ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే వ‌స్తువులు, ఎలక్ట్రానిక్ ఉపక‌ర‌ణాలు, దుస్తులు ఇలా యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన ఏ వ‌స్తువునైనా ఫేస్‌బుక్ షాప్‌లో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు త‌మ లొకేష‌న్‌ను ఆన్ చేస్తే త‌మ‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న అమ్మ‌కందారుల వివ‌రాల‌ను కూడా తెలుసుకోవచ్చు. 

ఫేస్‌బుక్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఈ షాప్ ఫీచ‌ర్ ముందుగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు అందుబాటులోకి రానుండ‌గా, అనంత‌రం డెస్క్‌టాప్ వెర్ష‌న్‌లోనూ దీన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫీచ‌ర్ మొద‌ట యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫేస్‌బుక్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.

No comments:

Post a Comment